News February 22, 2025
ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్‌లో పాల్గొంటామన్నారు.
Similar News
News January 9, 2026
సిద్దిపేట ఐటీ టవర్‌లో ఇంటర్న్‌షిప్ మేళా

సిద్దిపేట ఐటీ టవర్‌లోని టాస్క్(TASK) కేంద్రంలో స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. 2024, 2025లో ఉత్తీర్ణులైన బీటెక్, బీఎస్సీ అభ్యర్థులు దీనికి అర్హులు. అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సొంత ల్యాప్‌టాప్ ఉండాలి. ఆసక్తి గలవారు ఈ నెల 11న ఐటీ టవర్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.
News January 9, 2026
ఘనంగా ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

AP: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ఘనంగా ముగిశాయి. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ పవిత్ర దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. 9 రోజుల్లోనే 7 లక్షల మందికి పైగా దర్శన భాగ్యం కలగగా, పదో రోజుతో ఈ సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరనుంది. ఈ సందర్భంగా హుండీ కానుకలుగా రూ.36.86 కోట్లు లభించాయి. 37.97 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
News January 9, 2026
భిక్కనూరు: కాలుష్యంపై ‘సభ’లో గళమెత్తరేం?

భిక్కనూరులో కాలుష్యం కోరలు చాస్తున్నా.. కొత్త కంపెనీల పేరుతో ముప్పు ముంచుకొస్తున్నా.. స్థానిక ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో కనీసం నోరు మెదపకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పాత కంపెనీపై ధర్నాలు చేసిన ఆయన ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నా సభలో కాలుష్యంపై ఎందుకు మాట్లాడడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నాడు రోడ్డెక్కిన వారు.. నేడు సభలో మౌనం దాల్చడం వెనుక ఆంతర్యమేంటని జనం నిలదీస్తున్నారు.


