News February 5, 2025
ఇబ్రహీంపట్నం: ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన గంగాధర్ (15) అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ బుధవారం తెలిపారు. స్కూల్ కి వెళ్లకుండా తిరుగుతున్నాడని అతని తల్లి రాజవ్వ మందలించి పనులకు వెళ్ళింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా శబ్దం విని అతని పిన్ని బంధువులకు తెలుపగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
Similar News
News November 6, 2025
దూడపై చిరుతపులి దాడి.?

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 6, 2025
TG SETకు దరఖాస్తు చేశారా?

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్షిప్కు అర్హత సాధించే <
News November 6, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.


