News October 20, 2024
ఇబ్రహీంపట్నం: కొండపల్లి బొమ్మల కళాకారులకు శుభవార్త

ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి బొమ్మల కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బొమ్మల తయారీకి అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారిన నేపథ్యంలో వాటికై వినియోగించే అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ చెట్లు పెంచాలని పవన్ అధికారులను ఆదేశించారని జనసేన తమ అధికారిక x ఖాతాలో పోస్ట్ చేసింది.
Similar News
News November 28, 2025
జిల్లాలో ధాన్యం సేకరణకు 3,715 వాహనాలు: కలెక్టర్

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లాలో ధాన్యం సేకరణకు 3,715 వాహనాలను నడుపుతున్నామని కలెక్టర్ డీకే బాలాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ధాన్యం సేకరణ, గంజాయిపై అవగాహన, తదితర అంశాలపై సమీక్షించారు.
News November 28, 2025
పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే అనుమతులు: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామన్నారు.