News November 27, 2024
ఇబ్రహీంపట్నం: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19)కు కొంత కాలంగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు పెళ్లి ఇష్టం లేక ఇంటి ఆవరణలో గల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News February 24, 2026
KNR: ‘పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను కరీంనగర్ జిల్లాలో ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 74 కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు.
News February 24, 2026
KNR: ‘మహిళా కార్యకర్తలు కృషి చేయాలి’

కరీంనగర్ DCC కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పార్టీ కోసం పోరాడిన సీనియర్ మహిళా నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మహిళా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News February 24, 2026
KNR: డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ నెల 27న వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణలో కంటిచూపు కీలకమని, ఆర్టీసీ, ఆటో, ఇతర వాహన డ్రైవర్లు పోలీసు ప్రధాన కార్యాలయం పక్కన గల అస్త్ర కన్వెన్షన్ హాల్‌లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.


