News April 14, 2025
ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలోనే టాప్ గోదూరు

జగిత్యాల జిల్లాలో ఎండ దంచికొడుతోంది. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరులో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో గోదూరు రాష్ట్రంలోనే టాప్ స్థానంలో నిలిచింది. గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 19, 2025
కడప: రేపు పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
News October 19, 2025
అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని APSDMA తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.
News October 19, 2025
విద్యుత్ కాంతులతో ముస్తాబైన కలెక్టరేట్

దీపావళి పర్వదినం సందర్భంగా కలెక్టర్ కార్యాలయాన్ని అధికారులు విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలో కలెక్టరేట్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో విరజిల్లుతోంది. అంతకుముందు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి, జాగ్రత్తలు పాటిస్తూ టపాసులు పేల్చాలని సూచనలు చేశారు.