News May 3, 2024
ఇబ్రహీంపూర్ అడవి ప్రాంతంలో చిరుతపులి సంచారం

మెదక్: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ అడవి ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. నెల రోజులుగా చిరుత పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నారు. గత రాత్రి చిరుత పులి సంచరిస్తున్న వీడియో సీసీ కెమెరాకు చిక్కడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అడవి ప్రాంతంలోకి ఎవరూ వెళ్ళవద్దని, పొలాలకు వెళ్లేవారు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Similar News
News September 18, 2025
MDK: మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

మెదక్లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 18, 19న దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు. కళాశాలలో బీఎస్సీ, బీఏ గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్టీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 7901097706ను సంప్రదించాలని సూచించారు.
News September 18, 2025
మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు జేఎంజే విద్యార్థులు

మెదక్ జిల్లా మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ మహేశ్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News September 17, 2025
మెదక్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్ అమీర్పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం PLAN INTERNATIONAL ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.