News March 8, 2025
ఇమాంపేట వసతిగృహ సంక్షేమ అధికారిపై వేటు

ఇమాంపేట షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జలగం వెంకటేశ్వర్లును కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సస్పెండ్ చేశారు. హాస్టల్ నిర్వహణలో లోపాలు, మెనూ పాటించకపోవడం, విధులకు డుమ్మా కొడుతుండడంతో చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏ హాస్టల్‌లో అయిన మెనూ పాటించకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు.
Similar News
News January 5, 2026
KNR: నిలిచిన రిజిస్ట్రేషన్లు.. మూడు రోజులుగా ఇదే గోస!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సాంకేతిక విఘాతం ఏర్పడింది. గత 3రోజులుగా సర్వర్ మొరాయిస్తుండటంతో క్రయవిక్రయాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న వారు కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫైళ్లు పెండింగ్‌లో పడటంతో రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి. సాంకేతిక లోపాన్ని సరిదిద్ది ప్రక్రియను త్వరలోనే పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.
News January 5, 2026
వారానికి 5 రోజులే పని చేస్తామని డిమాండ్.. కరెక్టేనా?

వారానికి 5 రోజులే పని చేస్తామని బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. UPIతో పనిభారం చాలా వరకు తగ్గిందని.. ఇప్పటికే రెండు, నాలుగో శనివారాలు సెలవులు ఉన్నాయి కదా అని పలువురు గుర్తు చేస్తున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ప్రొడక్టివిటీ పెంచేందుకు సెలవులు అవసరమని ఉద్యోగులు అంటున్నారు. వారానికి రెండు సెలవులతో బ్యాంకుల మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. COMMENT?
News January 5, 2026
మహిళల భద్రతకు ‘పోష్’ కమిటీలు తప్పనిసరి: కలెక్టర్

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నివారించేందుకు ‘పోష్’ చట్టం-2013ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని, అందులో సగం మంది మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు నెల రోజుల్లోగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని గడువు విధించారు.


