News January 10, 2026
ఇరాన్ విప్లవం గురించి తెలుసా?

ఇరాన్ చివరి రాజు మహ్మద్ రెజా షా పహ్లావి 1941 నుంచి 1979 వరకు పాలించారు. ఆయిల్ నిల్వలను అమెరికా కంపెనీలకు కట్టబెట్టడం, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడంతో మత పెద్దలు, ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అయతుల్లా రుహొల్లా ఖమేనీ నాయకత్వంలో(1979) ఇస్లామిక్ విప్లవంతో రెజా దేశం విడిచి పారిపోయారు. ఖమేనీ US కంపెనీలను బహిష్కరించారు. మహిళలపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఖమేనీల పాలనపై <<18808619>>వ్యతిరేకత<<>> మొదలైంది.
Similar News
News January 21, 2026
VJA: మహిళ వేషం ధరించి చోరీ.. నిందితుడి అరెస్ట్

మహిళ వేషం ధరించి బంగారం చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కండ్రికకు చెందిన ఓ వృద్ధురాలని అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి మహిళ వస్త్రాలు ధరించి బంగారం సోమవారం చోరీ చేశాడు. ఈ ఘటనపై సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేసినట్లు నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అతని వద్ద నుంచి బంగారం లాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News January 21, 2026
జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.
News January 21, 2026
జనవరి 21: చరిత్రలో ఈరోజు

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం


