News September 20, 2024

ఇల్లంతకుంట: బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థికి పాముకాటు

image

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పల్లిలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థి పాము కాటు గురయ్యాడు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామవత్ రోహిత్(12) అనే విద్యార్థి బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం పాము కరిచిందని కేకలు వేశాడు. గమనించిన పాఠశాల సిబ్బంది ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News October 2, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,02,748 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.54,363, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.24,920, అన్నదానం రూ.23,465 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News October 2, 2024

మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి: మాజీ MLA సతీశ్ కుమార్

image

మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కొండా సురేఖకు కేటీఆర్‌పై చేసిన ఆరోపణలపై న్యాయ పరంగా ముందుకు వెళ్తామని, కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని సతీష్ డిమాండ్ చేశారు.

News October 2, 2024

కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అన్నారు. మూసీపై బీఆర్ఎస్ వైఖరిని తెలపాలన్నారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టమని అన్నారు.