News May 11, 2024
ఇల్లంతకుంట మండల విద్యాధికారి సస్పెన్షన్.!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల విద్యాధికారి (FAC ) బన్నాజీని సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడి కే.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇల్లంతకుంట మండల ఎంపీపీ నుంచి బన్నాజీ సన్మానం పొందారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ RJDకి తెలియజేసారు. ఎన్నికల నియమనిబంధనలు బన్నాజీ ఉల్లంఘించడంతో సస్పెండ్ చేసినట్టు RJD తెలిపారు.
Similar News
News December 9, 2025
KNR కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 104 క్లస్టర్లలో పెట్రోలింగ్‌తో పాటు, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
News December 9, 2025
‘ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది గుమికూడొద్దు’

కరీంనగర్ తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. రూరల్ డివిజన్‌లోని ఐదు మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి DEC 11 రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.
News December 9, 2025
చొప్పదండి: నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఈనెల 13న జరగనున్న దృష్ట్యా, నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణపై విధి విధానాలు చర్చించి, సామగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓ మోహన్ పాల్గొన్నారు


