News April 3, 2025

ఇల్లందకుంట: యువ కౌలు రైతు ఆత్మహత్య

image

వ్యవసాయంలో వచ్చిన నష్టాన్ని భరించలేక యువ కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇల్లందకుంట మండలం సిరిసేడులో జరిగింది. స్థానికుల వివరాలు.. వంగ మధు(28) గ్రామంలో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంటను వేయగా.. రూ.2లక్షల వరకు నష్టం వచ్చింది. దీంతో మనస్తాపంతో ఆదివారం పురుగుమందు తాగి, వరంగల్ MGMలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.

Similar News

News April 12, 2025

KNR: ప్రశాంతంగా ముగిసిన బ్యాంకింగ్ ఉచిత శిక్షణ పరీక్ష

image

బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ బ్యాంకింగ్ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. ఉచిత శిక్షణ పరీక్షకు మొత్తం 67 మంది హాజరైనట్టు తెలిపారు.

News April 12, 2025

కరీంనగర్: ఉద్యోగం పేరుతో మోసం.. కేసు నమోదు

image

విదేశాలలో ఉద్యోగం పేరుతో యువకుడిని మోసంచేసిన వ్యక్తిపై కేసునమోదుచేసినట్లు 2టౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు. KNRభగత్‌నగర్‌కు చెందిన మెహర్‌తేజను HYDకు చెందిన ప్రశాంతరాథోడ్ బ్యాంకాక్‌లో బిజినెస్ ప్రాసెస్ ఉద్యోగం ఇప్పిస్తానని కొంత డబ్బుతీసుకొని బ్యాంకాక్ పంపించాడు. అక్కడ మోసపూరిత సంస్థలో చేర్పించి పాస్పోర్ట్ తీసుకొని నిర్బంధించారని, అక్కడి పోలీసుల సహాయంతో వచ్చానని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడన్నారు.

News April 12, 2025

భగ్గుమంటున్న కరీంనగర్

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 42.3°C నమోదు కాగా, గంగాధర 41.5, జమ్మికుంట 41.2, చిగురుమామిడి, గన్నేరువరం 40.8, రామడుగు 40.7, చొప్పదండి 40.6, హుజూరాబాద్, కొత్తపల్లి, సైదాపూర్ 40.2, తిమ్మాపూర్, కరీంనగర్ 40.0, కరీంనగర్ రూరల్ 39.7, వీణవంక 39.5, శంకరపట్నం 39.1, ఇల్లందకుంట 38.4°C గా నమోదైంది.

error: Content is protected !!