News April 1, 2025
ఇల్లందకుంట రామాలయం బ్రహ్మోత్సవాలు, జాతర వివరాలు

అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతాయని ఈవో సుధాకర్ తెలిపారు. ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న పట్టాభిషేకం,12న సూర్య రథోత్సవం( బండ్లు తిరుగుట)13, 14న చంద్ర రథోత్సవం(పెద్దరథం),15న శ్రీ పుష్పయాగం, 16న ఏకాంత సేవలు స్వామివారికి జరుపుతామన్నారు. భక్తులకు వైద్య, విద్యుత్, నీటి ఏర్పాట్లు చేశారు.
Similar News
News April 4, 2025
శంకరపట్నం: పోలీస్ విధులను ఆటంకపరిచిన వ్యక్తిపై కేసు నమోదు

కేశవపట్నం పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొత్తపల్లి రవి పేర్కొన్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఎలుకపెళ్లి కళ్యాణ్‌కు ఓ కేసు విషయమై కోర్ట్ సమన్లు ఇవ్వడానికి హోంగార్డ్ సదానందం అతని ఇంటికివెళ్ళగా.. తీసుకోవడానికి నిరాకరించాడు. అనంతరం సాయంత్రం పోలీస్ స్టేషన్ కి వచ్చి పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించడంతో కళ్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.
News April 4, 2025
కరీంనగర్: నేటి నుంచి జిల్లా ఆసుపత్రి కార్మికుల సమ్మె

నేటి నుంచి ఆసుపత్రి కార్మికులు సమ్మె చేయనున్నారు. కార్మికుల పెండింగ్ జీతాలను చెల్లించాలని కోరుతూ శుక్రవారం నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
News April 4, 2025
జమ్మికుంట: మున్సిపల్ కమిషనర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

ఆస్తిపన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జమ్మికుంట మొదటిస్థానం దక్కించుకుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్‌కు మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ కె.శ్రీదేవి హైదరాబాద్‌లో గురువారం రాష్ట్రస్థాయి ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా చొప్పదండి పట్టణంలో 84శాతం ఆస్తిపన్ను వసూలు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ నాగరాజును అభినందించారు.