News March 31, 2025
ఇల్లందకుంట: 4 నుంచి సీతారాముల బ్రహ్మోత్సవాలు

KNR జిల్లా ఇల్లందకుంట సీతారాములవారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా 13 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కళ్యాణం, పట్టాభిషేకం, చిన్న రథం, పెద్ద రథం మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు హనుమకొండ, భూపాలపల్లి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తారు. ప్రసుత్తం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.
Similar News
News January 1, 2026
అనకాపల్లి: 15 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణానికి నిధులు

అనకాపల్లి జిల్లాలో 15 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు జిల్లా క్రీడల శాఖ అధికారిణి పూజారి శైలజ తెలిపారు. బుధవారం నాతవరంలో ఆమె మాట్లాడారు. 14 మండలాల్లో క్రీడామైదానాల నిర్మాణ పనులు ప్రారంభం అయినట్లు శైలజ చెప్పారు. కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ స్థల వివాదం కోర్టులో ఉండడంతో అక్కడ పనులు చేపట్టలేదని అన్నారు. విద్యార్థులు క్రీడలు పట్ల ఆసక్తి చూపించాలన్నారు.
News January 1, 2026
T20 WCకు ఆస్ట్రేలియా.. హేజిల్‌వుడ్ రీఎంట్రీ

వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యాషెస్‌కు దూరమైన బౌలర్ హేజిల్‌వుడ్ రీఎంట్రీ ఇచ్చారు.
టీమ్: మిచెల్ మార్ష్(C), బార్ట్లెట్, కూపర్, కమిన్స్, టిమ్ డేవిడ్, గ్రీన్, ఎల్లిస్, హేజిల్‌వుడ్, హెడ్, ఇంగ్లిస్, కుహ్నేమాన్ , మ్యాక్స్‌వెల్, షార్ట్, స్టొయినిస్, జంపా.
News January 1, 2026
స్వచ్ఛరథం నిర్వహణకు ఏడు మండలాల్లో టెండర్ నోటిఫికేషన్

అడ్డతీగల, అరకు, చింతపల్లి, పాడేరు, రంపచోడవరం, రాజవొమ్మంగి, చింతూరు మండలాల్లో ప్రతి మండలం ఒక యూనిట్‌గా స్వచ్ఛరథం నిర్వహణకు టెండర్లు ఆహ్వానించారు. పొడి చెత్త, స్క్రాప్ నిర్వహణలో 3 ఏళ్ల అనుభవం, ట్రేడ్ లైసెన్స్ కలిగిన అర్హులు దరఖాస్తు చేయాలి. సంబంధిత MPDO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి.


