News March 31, 2025
ఇల్లందకుంట: 4 నుంచి సీతారాముల బ్రహ్మోత్సవాలు

KNR జిల్లా ఇల్లందకుంట సీతారాములవారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా 13 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కళ్యాణం, పట్టాభిషేకం, చిన్న రథం, పెద్ద రథం మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు హనుమకొండ, భూపాలపల్లి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తారు. ప్రసుత్తం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.
Similar News
News October 30, 2025
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం చర్చ: మంత్రి టీజీ

కర్నూలులోని ఏ, బీ, సీ క్వార్టర్స్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. బుధవారం ఎస్బీఐ కాలనీలో నగర అభివృద్ధిపై కేఎంసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలులోనే బెంచ్ ఉంటే బాగుంటుందని సీఎం కూడా చెప్పారని తెలిపారు. కర్నూలును ‘స్మార్ట్ సిటీ’గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
News October 30, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 30, 2025
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: బీఎస్పీ

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. బుధవారం ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా జిల్లా సాధనలో అలసత్వం వహించారన్నారు. కూటమి ప్రభుత్వం 6 కొత్త జిల్లాలను ప్రకటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయని, అందులో హిందూపురం పేరు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరారు.


