News March 31, 2025

ఇల్లందకుంట: 4 నుంచి సీతారాముల బ్రహ్మోత్సవాలు

image

KNR జిల్లా ఇల్లందకుంట సీతారాములవారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా 13 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కళ్యాణం, పట్టాభిషేకం, చిన్న రథం, పెద్ద రథం మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు హనుమకొండ, భూపాలపల్లి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తారు. ప్రసుత్తం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.

Similar News

News April 25, 2025

ADB: వడదెబ్బకు ఏడుగురి మృతి

image

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.

News April 25, 2025

NRML: ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్జాపూర్ గ్రామానికి చెందిన కదం ప్రకాశ్(41) మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటి తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News April 25, 2025

దహెగాం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు: SI

image

దహెగాం మండలానికి పెసరకుంట గ్రామానికి చెందిన కామెర హొక్టుపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై కందూరి రాజు తెలిపారు. 11 ఏళ్ల బాలిక ఇంటి వద్ద తన చెల్లిన ఆడిస్తుండగా.. హొక్టు వెళ్లి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!