News March 18, 2025
ఇల్లందకుంట: GREAT.. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్

నిన్న విడుదలైన గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇల్లందకుంట మండలం సిరిసేడుకి చెందిన బీనవేని పరుశురాం ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్ సాధించి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరుశురాముది పేద రైతు కుటుంబం. అయినప్పటికీ కష్టపడి చదివి 2023 పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం పరుశురాం కేయూలో PHD చేస్తున్నాడు.
Similar News
News March 18, 2025
సైదాపూర్: నీటిసంపులో పడి బాలుడి మృతి

నీటిసంపులో పడి బాలుడు మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం బొమ్మకల్లో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎలబొయిన సురేశ్-చైతన్యల కుమారుడు ప్రజ్ఞాన్ (2) నీటిసంపులో పడి చనిపోయాడు. రోజువారీలానే పిల్లాడిని ఇంటి వరండాలో ఆడుకోవడానికి వదిలేశారు. ఎంత సేపయినా బాలుడి ఆచూకీ కన్పించకపోవడంతో చుట్టుపక్కల వారి ఇంట్లో వెతికారు. అయినా కన్పించకపోవడంతో సంపులో వెతగ్గా బాలుడి మృతదేహం లభ్యమైంది.
News March 18, 2025
KNR: టీబీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

టీబీ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉన్న వారంతా TBపరీక్ష చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ TBనిర్మూలన కార్యక్రమంలో భాగంగా మెట్రోసెమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన TB వ్యాధిగ్రస్థులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి టీబీ తొందరగా వ్యాపిస్తుందని, అందువల్ల సమతుల పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
News March 18, 2025
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ -2 ఉద్యోగానికి మొలంగూర్ వాసి ఎంపిక

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన చల్లూరి రాజకుమార్ ఇటీవల వెలువడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ -2 ఫలితాల్లో మంచిమార్కులు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. చల్లూరి సాయిలు, కేతమ్మల కుమారుడైన రాజకుమార్.. ఇన్నాళ్లు ఎంతో కష్టపడి చదివి తన కళ నెరవేర్చుకున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు రాజకుమార్‌కు అభినందనలు తెలిపారు.