News March 18, 2025
ఇల్లందకుంట: GREAT.. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్

నిన్న విడుదలైన గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇల్లందకుంట మండలం సిరిసేడుకి చెందిన బీనవేని పరుశురాం ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్ సాధించి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరుశురాముది పేద రైతు కుటుంబం. అయినప్పటికీ కష్టపడి చదివి 2023 పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం పరుశురాం కేయూలో PHD చేస్తున్నాడు.
Similar News
News February 26, 2026
పనితీరు ఆధారంగానే టీచర్లకు ప్రమోషన్లు.. విద్యా కమిషన్ ప్రతిపాదన

TG: టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు రద్దు చేసి, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ కీలక సూచనలు చేసింది. ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేయడం తప్పనిసరి చేయాలని, రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలు మార్చాలంది. ఈ నిబంధన ఇకపై నియమించే ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదికను CM రేవంత్ రెడ్డికి అందజేసింది.
News February 26, 2026
అంకురార్పణతో మొదలైన రంగడి బ్రహ్మోత్సవాలు

నెల్లూరులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీతల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంకురార్పణతో మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు 26 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఆలయ అర్చకులు అంకురార్పణలో భాగంగా పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, మృత్ సంగ్రహణ, ఉత్సవమూర్తులకు రక్షాబంధన్, సోమ కుంభ ప్రతిష్ఠ, గరుడ ధ్వజ ప్రతిష్ఠ, అంకురార్పణ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
News February 26, 2026
కర్నూలులో ‘జై రాజ్ ATOOT 550D TMT బార్స్’ గ్రాండ్ లాంచ్

కర్నూలులో ఈనెల 21-22న జరిగిన ‘ATOOT ఆంధ్ర’ కార్యక్రమంలో Jai Raj ATOOT 550D TMT బార్స్‌ను ఆవిష్కరించారు. రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర ప్రాంతాల డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. రిటైల్ డీలర్లతో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలపరచడం, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం, నాణ్యత, దృఢత్వానికి కొత్త ప్రమాణాలను స్థాపించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.


