News March 22, 2025
ఇల్లందు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం: జీఎం కృష్ణయ్య

బొగ్గు ఉత్పత్తిలో 2025 ఆర్థిక సంవత్సరానికి ఇల్లందు ఏరియాకు కేటాయించిన 41.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 11రోజుల ముందుగానే అధిగమించామని ఏరియా జీఎం కృష్ణయ్య తెలిపారు. మార్చి నాటికి ఏరియాకు కేటాయించిన దానికంటే ఎక్కువగా శుక్రవారం 41.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 100.12% అన్ని ఏరియాలకంటే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి ఇల్లందు ఏరియా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
Similar News
News February 24, 2026
గుంటూరు: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనుటకు బస్ సౌకర్యం అంశాలను అడిగారు.
News February 24, 2026
కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

మంత్రులు రామానాయుడు, టీజీ భరత్ సమక్షంలో కర్నూలు జిల్లా అభివృద్ధిపై కీలక సమీక్ష జరిగింది. కలెక్టర్ డా.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎంపీ నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పాల్గొన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అవసరాలపై నివేదికలు సమర్పించారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబు నాయుడితో జరిగే భేటీ కోసం పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు.
News February 24, 2026
8వ తరగతి బుక్‌పై వివాదం

వచ్చే విద్యా సం. కోసం 8వ తరగతి సోషల్ బుక్‌లో NCERT చేసిన కొన్ని మార్పులపై వివాదం రాజుకుంది. ‘సమాజంపై న్యాయవ్యవస్థ ప్రభావం’ టాపిక్‌లో కొత్తగా ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశాన్ని చేర్చారు. ప్రజలకు జుడీషియరీపై తప్పుడు ఉద్దేశం ఏర్పడుతుందని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక స్వాతంత్ర్య ఉద్యమ టాపిక్‌లో.. దేశ విభజనను తొలుత కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికీ, చివరికి తప్పక అంగీకరించిందని కొత్తగా చేర్చింది.


