News November 24, 2024

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే మృతి.. నేపథ్యమిదే..

image

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70)<<14693570>> తెల్లవారుజామున కన్నుమూశారు<<>>. ఆయన రెండు సార్లు (1983,94) సీపీఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ లభించకపోవడంతో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) నుంచి పోటీ చేసి ఓడారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా టికెట్ దక్కకపోడవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Similar News

News December 13, 2024

ఖమ్మం: ‘కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలి’

image

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం నగరంలో నిర్వహించిన సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి వారు హాజరయ్యారు. మద్దతు ధర గ్యారెంటీ చట్టాన్ని అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి మూడవసారి అధికారంలోకి వచ్చాక విస్మరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరావు పాల్గొన్నారు.

News December 13, 2024

లక్ష్యసాధనకు నిర్విరామంగా కృషి చేయాలి: ముజమ్మిల్ ఖాన్ 

image

నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు విద్యార్థులు నిర్విరామంగా కృషి చేయాలని కమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం నయా బజార్ జూనియర్ కళాశాల కాంప్లెక్స్ లో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో మున్నేరు వరద బాధితులకు అందించిన వరద సహాయక కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న ఖమ్మంను విడతల వారీగా బాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

News December 12, 2024

ప్రపంచాన్ని మార్చే శక్తి కమ్యూనిజానికే ఉంది: తమ్మినేని

image

ప్రపంచాన్ని మార్చే శక్తి కమ్యూనిజానికి మాత్రమే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఏదులాపురంలో పాలేరు డివిజన్ 8వ మహాసభ నిర్వహించారు. పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు కమ్యూనిస్టులంటే భయమని చెప్పారు. అందుకే కమ్యూనిస్టులపై నిత్యం విష ప్రచారం చేస్తూ, బురద చల్లుతూ ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటారని విమర్శించారు.