News July 10, 2024

ఇల్లందు: మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడి ఆత్మహత్య

image

మున్సిపల్ చెత్త సేకరణ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏ.కార్తీక్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం రామవరానికి చెందిన కార్తీక్ ఇల్లెందు మున్సిపాలిటీలో హరితహారంలో వర్కర్‌గా పనిచేస్తున్న రమేశ్ వద్ద ఉంటూ తడి, పొడి చెత్త సేకరణ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్న కార్తీక్.. మంగళవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి ఉరివేసుకున్నాడు.

Similar News

News January 2, 2026

ఈనెల 3న ఖమ్మం నగరంలో జాబ్ మేళా.!

image

ఖమ్మంలో ఈనెల 3న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థ వరుణ్ మోటార్స్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 133 ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన వారు అర్హులని అన్నారు. ఆసక్తిగల నిరుద్యోగులు ఖమ్మం ఇల్లందు రోడ్డులోని వరుణ్ మోటార్స్‌లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.

News January 1, 2026

టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS : సీపీ

image

JAN 3 నుండి 20 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే టీజీ టెట్ పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అటు సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

News January 1, 2026

అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం

image

ఖమ్మం నగరంలోని అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడిగా బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారుగా పల్లెబోయిన చంద్రయ్య, దండా జ్యోతి రెడ్డి, అధ్యక్షుడిగా అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బెల్లి కొండల్ రావు, కోశాధికారిగా పల్లపు సత్యంతో పాటు ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, వీరబాబు, మణికంఠ, వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.