News March 11, 2025
ఇల్లందు: సకల సదుపాయాలతో ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం

ఇల్లందు పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.38 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, రూ.11 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలో ఆయా భవన నిర్మాణాల కోసం సేకరించిన స్థలాలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్తో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. వారివెంట ఏరియా జీఎం వీ.కృష్ణయ్య, ఎమ్మార్వో రవికుమార్ ఉన్నారు.
Similar News
News November 1, 2025
MHBD: ఈనెల 16న పంచారామాలకు టూర్: DM

MHBD డిపో నుంచి నవంబర్ 16న టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పంచారామాలు యాత్ర టూర్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని DM కళ్యాణి తెలిపారు. డిపో నుంచి 16న 40 సీట్ల డీలక్స్ బస్సు రాత్రి 11 గం.కు వెళ్తుందని, పంచారామాలకు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) చేరుకుని 18న తిరిగి MHBDకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1700, పిల్లలకు రూ.900ఛార్జీ ఉంటుందని, 7396210102, 9948214022 సంప్రదించాలన్నారు.
News November 1, 2025
HNK: ఆకతాయిలు వేధిస్తే షీ టీంకు సమాచారం ఇవ్వండి!

మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత కోరారు. వరంగల్ ఉర్సుగుట్ట వద్ద కార్ షోరూం ఉద్యోగులకు డయల్ 100, సైబర్ క్రైమ్, టీసేవ్ యాప్తో పాటు షీ టీం సేవలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దని, 8712685142కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు ఇన్స్పెక్టర్ సూచించారు.
News November 1, 2025
హనుమకొండ: ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 15న హనుమకొండ, పరకాల కోర్టుల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. రాజీపడదగు క్రిమినల్, సివిల్, ఎం.వి.ఏ., వివాహ, కుటుంబ, బ్యాంకు రికవరీ, ఎన్ఐ యాక్ట్ కేసులు పరిష్కరించనున్నారు. కక్షిదారులు తమ న్యాయవాదులతో హాజరై రాజీ కుదుర్చుకోవాలని అధికారులు సూచించారు.


