News March 12, 2025

ఇల్లు కట్టుకున్నవారికి అదనపు లబ్ధి: కలెక్టర్

image

2016-17 నుంచి 2023-24 వరకు పీఎంఏవై ద్వారా గృహాలు మంజూరై నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నవారికి ప్రభుత్వం అదనపు సహాయం అందజేస్తుందని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్న లబ్ధిదారులలో ఎస్సీలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News September 18, 2025

సభా సమయం.. జిల్లా నేతల సంసిద్ధం!

image

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. జిల్లాలో రోడ్లు, నీటి ప్రాజెక్టుల వంటి అంశాలపై గళమెత్తేందుకు సిద్ధమయ్యారు. ఓర్వకల్లు పారిశ్రామిక పార్క్‌కు భారీ పరిశ్రమలు వస్తుండటంతో పెట్టబడుల వివరాలను మంత్రి భరత్ వివరించే అవకాశముంది. ఇక తమ గోడు అసెంబ్లీలో వినిపించాలని ఉల్లి, టమాటా రైతులు కోరుతున్నారు.

News September 18, 2025

27 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

image

ఐఐటీ ఢిల్లీలో 4 ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. ఐఐటీ హైదరాబాద్‌లో 4 రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఈనెల 26 వరకు, మునిషన్స్ ఇండియా లిమిటెడ్‌లో 14 ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌లో 5 ఉద్యోగాలకు అక్టోబర్ 3 వరకు అవకాశం ఉంది.

News September 18, 2025

పాలకోడేరు: గల్లంతైన జైదేవ్ మృతదేహం లభ్యం

image

పాలకోడేరు మండలం వేండ్ర కట్టా వారిపాలెం గోస్తని నదిలో గల్లంతైన చిన్నారి జైదేవ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన అతడి కోసం నాలుగు రోజులుగా ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు గాలింపు చేపట్టారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రపుడెక్కల్లో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.