News September 2, 2024

ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వరద బాధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 10, 2025

ఖమ్మం: ఉపాధ్యాయుల హాజరుపై ‘యాప్’ కొరడా!

image

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కోసం ప్రవేశపెట్టిన FARS యాప్ ఇప్పుడు ఉపాధ్యాయులపై నిఘా పెట్టింది. హాజరు తక్కువ ఉన్న హెచ్‌ఎంలను కలెక్టర్ మందలించారు. సక్రమంగా హాజరుకాని టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమయపాలన, సెలవు/ఓడీ అప్‌డేట్‌ యాప్‌లో తప్పనిసరి. ఈ కఠిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

News November 10, 2025

‘వనజీవి రామయ్య’ బయోపిక్‌కు భట్టికి ఆహ్వానం

image

పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవానికి రావాలని చిత్ర దర్శకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చరిత్రను సినిమాగా తీయడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.

News November 10, 2025

రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో

image

రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో ఐకేపీ సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో ప్లాంట్ నిర్మాణానికి 4 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్లాంట్ నిర్వహణ మహిళ సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్లాంట్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. 25 ఏళ్లపాటు వారంటీతో కూడిన సోలార్ పలకలు ఏర్పాటు చేయనున్నారు.