News April 24, 2024

ఇల్లెందు: జారిపడి చిన్నారి మృతి

image

భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సీఎస్పీ బస్తీ సింగరేణి సీ4 క్వార్టర్లో విషాదం జరిగింది. జిమ్మేదారి కామరాజు మనువరాలు అనిక (5) ఆదివారం అర్ధరాత్రి టాయిలెట్​కు వెళ్లి వస్తుండగా జారిపడి చనిపోయింది. తల వెనుక భాగంలో బలమైన గాయమవ్వడంతో చిన్నారి కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన సింగరేణి వైద్యశాలకు తరలించిగా పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 

Similar News

News November 17, 2025

పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

image

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్‌లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పుట్టకోట మహిళలు కోరిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో ఆర్డీఓ, హౌసింగ్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముదిగొండ వల్లభి యువత కోరిన విధంగా గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని సూచించారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.