News June 29, 2024

ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొట్లాట

image

ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ పాషా కొట్లాటకు దిగారు. పరస్పరం ఇరువురు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో ఛైర్మన్ వర్సెస్ వైస్ ఛైర్మన్ వర్గాలుగా కౌన్సిలర్లు విడిపోయారు. కాగా ఈ ఘటన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలోనే జరిగింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎమ్మెల్యే సముదాయించడంతో ఇరువురు శాంతించారు.

Similar News

News November 8, 2025

ఖమ్మం: సైబర్ నేరగాళ్లకు 23 నెలల జైలు

image

సైబర్ నేరాలకు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నిందితులకు ఖమ్మం కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితులు మహిర్ అజాద్(25), వకీల్(22)పై కేసు నమోదు చేసి, సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో వారి నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పి.నాగలక్ష్మి నిందితులకు 23 నెలల 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

News November 8, 2025

ఖమ్మం: కోతులు, కుక్కలతో బేజారు

image

ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముదిగొండ మండలంలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చిన్నపిల్లలు, మహిళలు గాయపడి ఆసత్రి పాలయ్యారని, రేబిస్ భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నట్లు చెప్పారు. పరిస్థితి చేయి దాటి పోకముందే వాటిని నియంత్రించాలని మండల ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది.

News November 7, 2025

ఖమ్మంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖానాపురం హవేలీ పోలీసుల కథనం ప్రకారం.. గోపాలపురంలోని కశ్మీర్ దాబా ఎదురుగా అర్ధరాత్రి ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.