News April 12, 2025
ఇళ్ల ఎంపికలో జాప్యం వద్దు: భూపాలపల్లి కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి డీఆర్డీవో, డీఈఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం కాటారం డివిజన్లో లబ్ధిదారుల విచారణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News November 11, 2025
NGKL: రాజ్ మార్గమే రాజమార్గం- SP

లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవలని నాగర్కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ సూచించారు. ఈనెల 15న శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాజీపడదగిన సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. “రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొంటూ, కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
News November 11, 2025
రక్షణ చట్టం వచ్చేవరకు మా అడుగులు ఆగవు- న్యాయవాదుల

న్యాయవాదుల భద్రత దేశ న్యాయవ్యవస్థ గౌరవానికి మూలం. రక్షణ చట్టం అమలు అయ్యే వరకు మా అడుగులు ఆగవు అని న్యాయవాద సంఘ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం గవ్వల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘న్యాయవాదుల రక్షణ – చలో హైదరాబాద్’ పాదయాత్ర మూడో రోజు బీచుపల్లి శ్రీరామాలయం ప్రాంగణంలో ప్రార్థనలతో ప్రారంభమైంది. ‘న్యాయవాది రక్షణ చట్టం – ఇప్పుడే అమలు చేయాలి’ అంటూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన యూపీ మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.


