News October 9, 2024
ఇళ్ల నిర్మాణాలపై ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం

ఏలూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలు కచ్చితంగా పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో ఇళ్ల నిర్మాణాల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రగతిపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా రోజుకు 54 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
Similar News
News December 5, 2025
కలెక్టర్ పిలుపు.. ‘3కె రన్ విజయవంతం చేయండి’

భీమవరం పట్టణంలో ట్రాఫిక్పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 3కె రన్ శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రన్ బీవీ రాజు సర్కిల్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఆర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
News December 5, 2025
ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
News December 5, 2025
ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.


