News September 2, 2024
ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి: కలెక్టర్
నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణాలు, ఉపాధి హామీ పథకం అమలు, పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల నిర్వహణ అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మండల వారీగా స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలతో పురోగతిపై సమీక్ష చేశారు.
Similar News
News September 10, 2024
కర్నూలు జిల్లా టీడీపీ తరఫున వరద బాధితులకు సహాయం
కర్నూలు జిల్లా టీడీపీ తరఫున వరద బాధితులకు రూ.1.50 కోట్ల విలువ చేసే నిత్యవసరాల సరుకులను విరాళంగా ఇచ్చారు. ఇవి దాదాపు 10 వేల కిట్లు ఉంటాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఈ నిత్యావసరాల సరుకులను తీసుకెళ్తున్న వాహనాలను కలెక్టర్ రంజిత్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు.
News September 10, 2024
బ్యాంకర్లు పేదలకు అండగా నిలవాలి: కలెక్టర్
అవసరాల్లో ఉన్న పేదలకు బ్యాంకర్లు రుణాల మంజూరు చేసి అండగా నిలవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లకు సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశం మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పశుసంవర్థక శాఖకు సంబంధించి గోకులం పథకం కింద లబ్దిదారుల గుర్తింపు పూర్తి చేసి త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని అన్నారు.
News September 10, 2024
గత ప్రభుత్వ మైకం నుంచి అధికారులు బయటపడాలి: ఎంపీ
కొందరు అధికారులు గత ప్రభుత్వ మైకంలోనే ఉన్నారని, వాటి నుంచి బయటపడాలని, గతం ఒక లెక్కా, ఇప్పటి నుంచి మరో లెక్క అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులందరం కలిసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.