News October 11, 2024

ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

ఇంటి నిర్మాణాల్లో దిగువ స్థానంలో ఉన్నామని, ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 23శాతం మాత్రమే ప్రగతి సాధించారన్నారు.

Similar News

News October 11, 2024

జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన బెళగల్ విద్యార్థి

image

కోసిగి మండలం దొడ్డి బెళగల్‌కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సందిప్ ఆగ్రాలో జరిగిన జాతీయ స్థాయి లాక్రోస్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీయాన్ కుమారి అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు.

News October 11, 2024

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజా

image

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుధ పూజ చేశారు. అర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో గల ఆయుధాగారంలో దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

News October 11, 2024

అయ్యో పాపం.. అమ్మ చనిపోయిందని తెలియక!

image

కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో కుక్క చనిపోయింది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. ఈ కుక్కకు నాలుగు పిల్లలు ఉండగా తల్లి చనిపోయిన విషయం వాటికి తెలియదు. తల్లి లేస్తుందేమోనని ఆశతో ఒడిలో నిద్రపోయాయి. ఆ పిల్లల దీనస్థితిని చూస్తూ అటుగా వెళ్లేవారు అయ్యో పాపం అంటూ వెళ్లిపోయారు. మృతదేహం వద్ద ఉన్న ఆ పిల్లలు చూపరులకు కంటతడి తెప్పించాయి.