News February 11, 2026

ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎంతంటే?

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.270 తగ్గి రూ.1,58,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

Similar News

News March 17, 2026

రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG.. ఆందోళన వద్దు: CM

image

AP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

News March 17, 2026

చదువులో కాకపోయినా.. క్రికెట్‌లో 80% కొట్టేసిన సూర్యకుమార్

image

కెప్టెన్‌గా సూర్యకుమార్ విన్నింగ్ పర్సంటేజ్ 80% దాటింది. ‘చదువులో నాకు ఎప్పుడూ 50-60% కూడా దాటలేదు. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజీని క్రికెట్‌లో సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని సరదాగా వ్యాఖ్యానించారు. తన ఫ్యామిలీ మొదట్లో చదువుపై ఫోకస్ చేయమన్నా.. తర్వాత తన ప్యాషన్‌ను గుర్తించి సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. WC నెగ్గిన తర్వాత కూడా తన భార్య దేవిషా తనలో అహంకారం పెరగకుండా చూస్తోందన్నారు.

News March 17, 2026

బెంగాల్‌లో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదు: మమతా బెనర్జీ

image

బెంగాల్‌లో BJPకి గతం కంటే ఈసారి సీట్లు తగ్గుతాయని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఆటలాడినా ఆ పార్టీకి ఏ మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ‘బెంగాల్’ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదని ఎద్దేవా చేశారు. కాగా WBలో మొత్తం 294 సీట్లకు గాను TMC 291 చోట్ల పోటీ చేస్తోంది. 3 సీట్లను మిత్రపక్షం BGPMకు కేటాయించింది.