News March 21, 2025
ఇవాళ రాత్రికి మంత్రి ఫరూక్ సతీమణి అంత్యక్రియలు

మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ ఇవాళ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో, అందులోనూ ఇవాళ శుక్రవారం కావడంతో ఈ రాత్రికే ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫిలింనగర్లోని మంత్రి నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. రాత్రి 8 గంటలకు HYDలోని ఆగాపుర, పాన్మండి ఖబరస్తాన్లో అంత్యక్రియలు జరగనున్నాయి.
Similar News
News November 18, 2025
చావడానికి సిద్ధంగా ఉన్నా: యువరాజ్ తండ్రి

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ అన్నారు. తన స్వగ్రామంలో ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనని చెప్పారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.

ఖమ్మం: సీతారామ పథకానికి అత్యధిక పరిహారం: అ. కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణపై సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి రైతులతో చర్చించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బాజుమల్లాయిగూడెం రైతులకు ఎకరాకు ₹11.44 లక్షలు, రేలకాయపల్లికి ₹12.40 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. భూముల ధరలు వార్షికంగా పెరిగే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, బాజుమల్లాయిగూడెం రైతులకు ₹15 లక్షలు, రేలకాయపల్లి రైతులకు ₹16 లక్షల పరిహారం అందిస్తామని ఆయన తెలిపారు.