News July 30, 2024
ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి అనుమతి లేదు

నల్లమల అభయారణ్యంలో వెలసిన శ్రీ ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి దర్శనానికి ఆగస్టు 1 తేదీ నుంచి అనుమతి నిలిపివేశారు. ఎన్టీసీఏ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వులో నక్కంటి రేంజ్ పరిధిలో జంగిల్ రైడ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. పులులు, వన్యప్రాణుల సంయోగ సమయంగా (గర్భం దాల్చే) పరిగణిస్తూ నల్లమల అభయారణ్యంలోని పర్యాటక ప్రదేశాలకు అనుమతి నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Similar News
News November 25, 2025
కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

కర్నూలులో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 95 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజలను ప్రత్యక్షంగా కలసి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, పోలీసు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 24, 2025
లింగ సమానత్వానికి కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 –మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.