News November 11, 2024
ఇసుకను నిర్ణయించిన ధరకే విక్రయించాలి: మంత్రి దుర్గేశ్
సామాన్య ప్రజలు, భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి దుర్గేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కొంతమంది ఇసుకను ఉచితంగా కాకుండా లాభాపేక్షతో ఎక్కువ ధరకు విక్రయించడం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం ఇసుకకు నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 11, 2024
సుకుమార్: మట్టపర్రు To పాన్ ఇండియా
పుష్ప పార్ట్-1, 2లతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్‌ది మన జిల్లానే. ఆయన ఉమ్మడి తూ.గో.జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు గ్రామంలో 1970లో జన్మించారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి కనబరిచే వారు. ఉన్నత చదువులు చదివిన ఆయన మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 2004లో ఆర్య మూవీతో డైరెక్టర్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హిట్‌లు అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన 8 సినిమాలకు దర్శకత్వం వహించారు.
News December 11, 2024
ప్రత్తిపాడు: పులి ఆచూకీ కోసం గాలింపు
ప్రత్తిపాడు మండలం బురదకోట అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఆచూకీ కోసం ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మరంగా గాలించారు. ఎంత వెతికినా పులి జాడ మాత్రం కనిపించలేదు. దాని కోసం 6 ట్రాప్ కెమెరాలను బురదకోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అనంతరం పులి ఆచూకీ తెలుసుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై రేంజర్ సమావేశం నిర్వహించి సిబ్బందికి సూచనలిచ్చారు.
News December 11, 2024
తూ.గో: అలా జరిగి ఉంటే వారు బతికి ఉండేవాళ్లు
మరో 5 కిలో మీటర్లు ప్రయాణించి ఉంటే ఇంటికి చేరుకునే వారు. అంతలో వారిని మృత్యువు కబళించింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో పోతవరానికి చెందిన విజయ్ కుమార్ భార్య, కుమారుడు మృతి చెందగా.. మరొక కుమారుడు గల్లంతయ్యారు. దీంతో విజయ్ కుమార్ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్యాపిల్లలను కోల్పోయానని అతడు మృతదేహాల వద్ద రోధించిన తీరు అందరినీ కలచివేసింది.