News October 7, 2024

ఇసుకపై ఏలూరు జేసీ కీలక ప్రకటన

image

ఏలూరు జిల్లాలో ప్రస్తుతం నెలకు సరిపడా ఇసుక ఉందని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి జేసీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టిసీమ, గూటాల, గూటాల-1 డీ-సిల్టేషన్ పాయింట్స్ ద్వారా త్వరలో ఇసుక అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఇసుక విషయంలో సమస్యలు ఎదురైతే 88865 42999, 95339 22444, 9493040757కు కాల్ చేయవచ్చని సూచించారు.

Similar News

News November 15, 2025

ఆర్చరీ క్రీడాకారులను అభినందించిన జేసీ

image

భీమవరం కలెక్టరేట్‌లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్కూల్ గేమ్స్ అండర్ 14,17 విభాగాల్లో ఆర్చరీ పోటీల్లో రాష్ట్ర స్థాయి బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా జేసీ ఆర్చరీలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని అన్నారు.

News November 15, 2025

గుంటూరులో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

image

మహిళల బ్యాగుల్లో నుంచి బంగారం నగలు దొంగలిస్తున్న ప.గో జిల్లా తాడేపల్లిగూడెం యాగరపల్లికి చెందిన ఆరుగురు దొంగల ముఠాను గుంటూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలపై మహిళల నుంచి ఫిర్యాదులు అందడంతో శుక్రవారం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేసి వీరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.22లక్షల విలువైన 75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

News November 15, 2025

భీమడోలు: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు

image

ఏడేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు భీమడోలు పోలీసులకు చిక్కాడు. వివరాలు ఇలా.. 2018లో ఏలూరుకు చెందిన ఆటోడ్రైవర్ రామప్రసాద్ రాత్రి వేళ తన ఆటోతో వెళ్తుండగా గుడివాడకు చెందిన స్టీవెన్ అడ్డగించి.. రామప్రసాద్‌ను హత్య చేసి ఆటో ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో స్టీవెన్‌ను అరెస్ట్ చేశారు. 2 వాయిదాల తర్వాత నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నిన్న గుడివాడలో అరెస్ట్ చేశారు.