News February 15, 2025
ఇసుక అక్రమ రవాణా ఉపేక్షించం: ఇన్ఛార్జ్ సీపీ

ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిని ఉపేక్షించబోం అని నిజామాబాద్ ఇన్ఛార్జి సీసీ సింధు శర్మ హెచ్చరించారు. 2025 జనవరి, ఫిబ్రవరి నెలలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 13, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 13, బోధన్ డివిజన్ పరిధిలో ఐదు ఇసుక అక్రమ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎవరైనా రవాణాకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Similar News
News December 17, 2025
ప్రకాశంలో రెడ్డి వర్సెస్ రెడ్డి.. పీక్స్ లోకి పాలి’ ట్రిక్స్’..!

ప్రకాశం రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉగ్ర పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేసి, పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది అధిష్టానం అభిమతం. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ ఉగ్ర పేరు దాదాపు ఖరారు చేయగా, ప్రకాశం రాజకీయం రెడ్డి వర్సెస్ రెడ్డి అంటూ జోరుగా చర్చ సాగుతోంది.
News December 17, 2025
ఖమ్మంలో తుది విడత ఎన్నికలు.. 9AM UPDATE

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాలు కలిపి ఉ.9 గంటల వరకు 27.45% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
☆ ఏన్కూరు-25.24%
☆ కల్లూరు- 28.33%
☆ పెనుబల్లి-31.52%
☆ సత్తుపల్లి- 23.63%
☆ సింగరేణి-25.71%
☆ తల్లాడ- 28.55%
☆ వేంసూరు- 27.38%
◇ ఎన్నికల అప్డేట్ కోసం WAY2NEWS ను చూస్తూ ఉండండి.
News December 17, 2025
ఖమ్మం: ‘ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

ఖమ్మం జిల్లా గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం TG-CET 2026 నిర్వహించనున్నట్లు DCO సిహెచ్.జ్యోతి తెలిపారు. పరీక్ష ఫిబ్రవరి 22 (ఆదివారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఉచిత విద్య, వసతి, భోజనం అందించే ఈ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు జనవరి 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.


