News February 11, 2025

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై పోలీస్ శాఖ దాడులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎవరైనా ఇసుక రవాణా చేస్తే కఠినమైన సెక్షన్స్ కింద(PDPP ACT, MINES ACT) కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

Similar News

News November 16, 2025

గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలి: SP

image

ఇవాళ బాపట్ల జిల్లాకు వస్తున్న గవర్నర్‌కు పటిష్ఠ భద్రత కల్పించాలని ఎస్పీ ఉమామహేశ్వర్ సిబ్బందికి సూచించారు. సూర్యలంక వద్ద గవర్నర్ పర్యటించనున్న ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, తిరిగి వెళ్లే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News November 16, 2025

మెదక్: దరఖాస్తుల ఆహ్వానం

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో అందించే పురస్కారాలకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నిర్వాహకుల నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17 వరకు https://wdsc.telangana.gov.in సమర్పించాలని సూచించారు.

News November 16, 2025

పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

image

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.