News January 1, 2025

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News January 14, 2025

కర్నూలు: కన్ను తెరిచిన పార్వతీ దేవి..!

image

కర్నూలు మండలం గార్గేయపురం గొల్ల వీధిలోని అతి పురాతన బావిలో ఉన్న శివాలయం నందు పార్వతీ దేవి విగ్రహం కన్ను తెరిచారనే ప్రచారం వైరలవుతోంది. ఈ విషయం తెలిసిన జనాలు పక్క ఊర్ల నుంచి తండోపతండాలుగా అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తాలూకా పోలీసులు చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు తోసుకోకుండా అమ్మవారిని చూసేందుకు ఒక్కొక్కరిని పంపుతున్నారు.

News January 14, 2025

నంద్యాల: లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెకు చెందిన శివరాఘవ రెడ్డి(22) సూసైడ్ చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పీఆర్‌టీ సర్కిల్ వద్ద గల కృష్ణ లాడ్జిలో అద్దెకు తీసుకున్న రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మృతుడు బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 14, 2025

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

నంద్యాలలో మంగళవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. శిరివెళ్లకు చెందిన అత్తార్ అస్లాం(26), తిమ్మాపురం గ్రామానికి చెందిన కాకాని కళ్యాణ్ బైక్‌పై సంజీవ నగర్ నుంచి శ్రీనివాస సెంటర్ వస్తున్నారు. మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. తీవ్ర గాయాలతో అస్లాం మృతి చెందాడు. గాయపడిన కళ్యాణ్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.