News February 22, 2025
ఇసుక ఓవర్ లోడింగ్‌కు పాలు పెడితే కఠిన చర్యలు: DSP

ఓవర్ లోడింగ్‌లను అరికట్టేందుకు మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ములుగు DSP రవీందర్ పరిశీలించారు. చెక్ పోస్టులో ఉన్న సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా DSP రవీందర్ మాట్లాడుతూ.. ఎవరైనా ఇసక ఓవర్ లోడింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 13, 2025
భూపాలపల్లి: రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

పలిమెల, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.


