News July 27, 2024
ఇసుక ఛార్జీలు వసూలు చేయట్లేదు: ప్రకాశం కలెక్టర్

ఇసుక స్టాక్ పాయింట్ల నిర్వహణ ఖర్చులు తప్ప ప్రజల నుంచి ప్రత్యేకంగా ఇసుక ఛార్జీలు వసూలు చేయలేదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 26 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. కొత్త ఇసుక విధానంలో రవాణా ఛార్జీల పరంగా వ్యత్యాసం లేకుండా చూస్తామని తెలిపారు.
Similar News
News October 30, 2025
వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో ఒంగోలు మాజీ ఎంపీ, మాజీ TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపైనా సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో అప్పన్నను అరెస్ట్ చేశారు.
News October 30, 2025
ప్రకాశం: నేడు కూడా పాఠశాలలకు సెలవు

ప్రకాశం జిల్లాలోని వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా అన్ని పాఠశాలలకు సెలవులు మంజూరు చేస్తూ డీఈవో కిరణ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని డీఈవో తెలిపారు. ఇప్పటికే తుఫాన్ నేపథ్యంలో 3 రోజులపాటు సెలవు ప్రకటించగా.. తాజాగా మరొక రోజును పొడిగించినట్లు, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News October 30, 2025
ప్రకాశం: UG పరీక్షలు వాయిదా

మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు జరగాల్సిన గ్రాడ్యుయేట్ (UG) 3, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటిని తిరిగి నవంబర్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ. డీవీఆర్ మూర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


