News October 19, 2024
ఇసుక టెండర్లను రద్దు చేసే అధికారం కలెక్టర్‌కి ఎవరిచ్చారు: కాకాణి

ఇసుక టెండర్లను రద్దు చేసే అధికారం నెల్లూరు జిల్లా కలెక్టర్‌కి ఎవరు ఇచ్చారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారాయణ నిర్ణయాలను బేకారత్తు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉచిత ఇసుక అని హామీ ఇచ్చి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇసుక దోపిడి చేస్తున్నారని, వెంటనే కలెక్టర్, ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 23, 2025
VIDEO.. సోమశిల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

సోమశిల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వర్షపు నీరు డ్యామ్ నిర్ధిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీంతో దిగువ పెన్నా డెల్టాకు 32,650 నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 70 టీఎంసీల నీరు డ్యామ్‌లో ఉందని అధికారులు వెల్లడించారు.
News October 23, 2025
ఊపిరి పీల్చుకున్న నెల్లూరు.. వర్షం ముప్పు తప్పునట్టేనా!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అందుకు భిన్నంగా నెల్లూరులో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి చిన్నచిన్న చినుకులు మినహా వర్షం పడలేదు. ఉదయం నుంచి ఎండ కాస్తోంది. దీంతో తుఫాను ముప్పు తప్పినట్టేనని జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
News October 23, 2025
ఛామదల నేరెళ్ల వాగులో పడి వ్యక్తి గల్లంతు..!

జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల గ్రామం నుంచి కావలికి వెళ్లేందుకు తన బైక్‌పై నేరెళ్ల వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ తోపాటు మల్లికార్జున కూడ సప్తా పై నుంచి వాగులో పడిపోయారు. విషయం తెలుసుకున్న జలదంకి తహశీల్దార్ ప్రమీల, ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి గాలింపు చర్యలు చేపట్టారు.