News August 22, 2024
ఇసుక పంపిణీ విధానం పక్కాగా అమలు చేయండి: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై తహశీల్దార్స్, ఎంపీడీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ జరగాలన్నారు.
Similar News
News September 14, 2024
వైసీపీ కార్యకర్తని పరామర్శించిన MP అవినాశ్
జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన హనుమంతు గురువారం కేసు విచారణకు కోర్టుకి వెళ్లి తిరిగి వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా డాడి చేయడంతో గాయపడిన హనుమంతురెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదుకు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆసుపత్రి వెళ్లి హనుమంతురెడ్డిని పరామర్శించారు.
News September 14, 2024
ఎర్రగుంట్ల: తండ్రి తాగొద్దని చెప్పినందుకు కొడుకు సూసైడ్
ఎర్రగుంట్లలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన చింతకుంట వెంకట్(18) రోజూ తాగి ఇంటికి వస్తుంటాడు. తన తండ్రి మందు తాగొద్దని మందలించేవాడని తెలిపారు. దీంతో శనివారం ఉదయం వెంకట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2024
ప్రొద్దుటూరు: ‘మా పాప మృతికి కారణం వైద్యులే’
ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి విషాదం నెలకొంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చాపాడు మండలం నక్కలదిన్నెకు చెందిన బాలఎల్లయ్య, సుమలతల కుమార్తె జసికాశ్రీ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. దీనికి కారణం చిన్నారి ఊపిరితిత్తిలో నిమ్ము ఎక్కువ అవ్వడమేనని వైద్యులు తెలిపారు. అయితే తమ పాప మృతికి కారణం వైద్యులే అని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు.