News August 13, 2024
ఇసుక మడుగులో ఈతకు వెళ్లి యువకుడు మృతి
పెద్ద శంకరంపేట ఇందిరా కాలనీకి చెందిన మహమ్మద్ ఇలియాస్ (30) నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించే ఇలియాస్ స్నేహితులతో కలిసి నిన్న ఇసుక మడుగు వద్ద మద్యం సేవించాడు. ఇసుక మడుగులో ఈత కొట్టడానికి వెళ్లి నీట మునిగిపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఈరోజు ఇసుక మడుగులో గాలింపు చేపట్టి శవాన్ని బయటకు తీశారు.
Similar News
News September 15, 2024
ఆర్సీపురం: గుండెపోటుతో యువకుడు మృతి
గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రామచంద్రపురంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిర్గాపూర్ మండలం సుర్త్యా నాయక్ తాండకు చెందిన జైపాల్ (28) కుటుంబ సభ్యులతో ఆర్సీపురంలో ఉంటున్నారు. అయితే స్థానిక వినాయక మండపంలో శనివారం రాత్రి డాన్స్ చేసి నీరసించిపోయి. ఇంటికి వచ్చి నిద్రించాడు. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
News September 15, 2024
సిద్దిపేట: నేటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు
నేటి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఈనెల 30 వరకు పోలీస్ కమిషనర్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సిద్దిపేట CP అనురాధ తెలిపారు. జిల్లాలోని పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించకూడదని అన్నారు. అలాగే సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని సూచించారు.
News September 15, 2024
ప్రైవేట్ టీచర్ల పట్ల సీఎం రేవంత్ తీరు సరిగాదు: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడడం తగదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోనీ పోలీస్ కన్వెన్షన్ హల్‌లో ట్రస్మా జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం కేవలం ప్రభుత్వ టీచర్లను మాత్రమే సన్మానించిందని ఆరోపించారు. గురువులంత సమానమేనని, ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా సన్మానించాలని సూచించారు.