News February 6, 2025

ఇసుక మాఫియాపై సీఎం ఉక్కు పాదం..!

image

భద్రాద్రి జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న 17 ఇసుక ర్యాంపులను నిలిపివేయాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రీచ్‌ల యాజమాన్యం వ్యవహరిస్తుండటం, వే బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సీఎం అధికారులను ఆదేశించారు.

Similar News

News December 6, 2025

రంగారెడ్డి: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో శుక్రవారంతో ముగిసింది. చివరి విడతలో స్వీకరించిన నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు. ఈనెల 9వ తేదీ వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. మూడో విడతలో 174 గ్రామపంచాయతీలకు, 1598 వార్డులకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. కాగా, జిల్లావ్యాప్తంగా 526 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

News December 6, 2025

NTR: పొందుగలలో బాలుడికి స్క్రబ్ టైఫస్ జ్వరం

image

మైలవరం మండలం పొందుగలకు చెందిన రాకేశ్ అనే బాలుడు జ్వరంతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు అతడిని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న బాలుడికి పరీక్షలు చేయగా, స్క్రబ్ టైఫస్ జ్వరమని నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని చంద్రాల పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు.

News December 6, 2025

జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అత్యల్పంగా రాఘవపేటలో 11.7℃, మన్నెగూడెం, గోవిందారం 11.8, గుల్లకోట 11.9, కథలాపూర్ 12, ఐలాపూర్, నేరెళ్ల 12.1, మేడిపల్లి 12.2, మల్యాల, మద్దుట్ల, రాయికల్ 12.3, సారంగాపూర్, పేగడపల్లి, మల్లాపూర్, పోలాస, కొల్వాయి 12.4, జగ్గసాగర్ 12.5, తిరుమలాపూర్, పూడూర్ 12.6, గొల్లపల్లి, బుద్దేశ్‌పల్లి, అల్లీపూర్ 12.7, గోదూరులో 12.8℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.