News August 14, 2024
ఇసుక రీచ్ల వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ల వద్ద అవసరం మేరకు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక రవాణాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సహజ వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరి అధికారులపై ఉందన్నారు.
Similar News
News December 4, 2025
కొత్త ఏడాదిలోనే మార్కాపురం జిల్లా..!

నూతన సంవత్సరం వస్తూ వస్తూ.. మార్కాపురం డివిజన్ ప్రజల కలను నెరవేరుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు జిల్లా ప్రకటనకు పచ్చజెండా ఊపారు. అయితే ఈనెల 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు గడువు ఉంది. దీనిని బట్టి 2026 రావడంతోనే, కొత్త జిల్లా అధికారిక ప్రకటన రానుంది. 2026 జనవరి 1 రోజే అధికారిక ఉత్తర్వులు రావచ్చని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద కొత్త ఏడాది కొత్త కబుర్లు తీసుకురానుందని ప్రజలు అంటున్నారు.
News December 4, 2025
పోక్సో కేసులను త్వరితగతిన విచారించండి: SP

పోక్సో కేసులను త్వరితగతిన విచారించి పూర్తి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి లోపం కనిపించకూడదన్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
News December 4, 2025
ప్రకాశంలో జోరు తగ్గిన మద్యం.. లెక్కలివే!

ప్రకాశంలో నవంబర్కు సంబంధించి మద్యం కొనుగోళ్ల జోరు తగ్గింది. అధికారుల వద్ద ఉన్న లెక్కల మేరకు (కోట్లల్లో).. ఈ ఏడాది జనవరిలో రూ. 105.69, ఫిబ్రవరి రూ. 106.28, మార్చి రూ. 117.41, ఏప్రిల్ రూ.66.5, మే రూ.117.41, జూన్ రూ.110.26, జులై రూ.105.37, ఆగస్ట్ రూ.118.62, సెప్టెంబర్ రూ.111.52, అక్టోబర్ రూ.95.38, నవంబర్ రూ. 86.75 కోట్లల్లో ఆదాయం దక్కింది. డిసెంబర్లో ఆదాయం అధికంగా రావచ్చని అధికారుల అంచనా.


