News August 23, 2024
ఇసుక స్టాక్ యార్డులోకి ఆ వాహనాలకే అనుమతి: కలెక్టర్

తుళ్లూరు మండలంలోని తాళాయపాలెం, లింగాయపాలెం ఇసుక స్టాక్ పాయింట్లను గురువారం కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో స్టాక్ పాయింట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే స్టాక్ యార్డులోకి అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
Similar News
News November 29, 2025
GNT: జెండర్ ఆధారిత హింసపై వైద్యాధికారులకు శిక్షణ

గుంటూరు (D) వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జెండర్ బేస్డ్ వైలెన్స్, మెడికో-లీగల్ కేర్‌పై వైద్యాధికారులకు శనివారం శిక్షణ నిర్వహించారు. APP మురళీకృష్ణ మహిళలు, బాలికలపై హింస నివారణలో వైద్యుల పాత్ర కీలకమని చెప్పారు. మెడికో-లీగల్ కేసుల్లో కన్సెంట్, ఉచిత చికిత్స, పోలీసులకు సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. జాతీయ హైవే ప్రమాద బాధితులకు రూ.లక్షన్నర వరకు క్లెయిమ్ అవకాశం ఉందని DMHO విజయలక్ష్మీ తెలిపారు.
News November 29, 2025
GNT: ‘రిజిస్ట్రేషన్ సమయంలో జాగ్రత్తలు పాటించాలి’

భూమి/ఇళ్ల రిజిస్ట్రేషన్ సమయంలో కచ్చితమైన డాక్యుమెంట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను (సేల్ 7.5%, గిఫ్ట్ 3.5%) సబ్ రిజిస్ట్రార్‌ను తెలుసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ శైలజ సూచించారు. ప్రాంతాల వారీగా భవన నిర్మాణ స్క్వేర్ ఫీట్ రేట్లు మారే అవకాశం ఉందని, వాటిని అంచనా వేయాలన్నారు. డాక్యుమెంటేషన్ ఛార్జీలు ₹3,000-₹5,000 వరకు ఉండొచ్చని తెలిపారు. సమస్యలుంటే వెంటనే సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని సూచించారు.
News November 29, 2025
GNT: వీవీఐపీ మార్గాల్లో ప్రత్యేక భద్రతా తనిఖీలు

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో DSW, SSG బృందాలు ప్రకాశం బ్యారేజ్-సెక్రటేరియట్, లోటస్ పాయింట్-టీడీపీ కార్యాలయం మార్గాల్లో ప్రత్యేక భద్రత తనిఖీలు చేపట్టాయి. అదనపు ఎస్పీ హనుమంతు, SSG డీఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో క్రిటికల్ పాయింట్లు, కల్వర్టులు, వ్యాపార సముదాయాలు, నిర్మాణ ప్రాంతాలు జాగిలాల సహాయంతో తనిఖీ చేశారు. ముందస్తు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులు తెలిపారు.


