News November 30, 2024
ఇస్తేమాకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం: కలెక్టర్
ఇస్తేమాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఆత్మకూరులో జనవరిలో జరగనున్న ఉమామి తబ్లిగే ఇస్తేమా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. మత పెద్దలు కమిటీలను ఏర్పాటు చేసుకుని, అందరి సహకారంతో పనులు చేసుకోవాలన్నారు. ఏమైనా సౌకర్యాలు కావాలంటే తమకు తెలపాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని మత పెద్దలను కోరారు.
Similar News
News November 30, 2024
లోక్సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టిన నంద్యాల ఎంపీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్సభలో శుక్రవారం ఆమె కీలక బిల్లును ప్రవేశపెట్టారు. తన పార్లమెంట్ స్థానమైన నంద్యాల కేంద్రంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్(CICDP) ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ శబరి లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.
News November 30, 2024
కర్నూలులో క్వింటా ఉల్లి రూ.5,259
ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. కర్నూలు మార్కెట్లో నిన్న గరిష్ఠంగా క్వింటా రూ.5,259 పలికింది. మధ్యస్థ ధర రూ.3,519గా ఉంది. ఉల్లి ధర అమాంతం పెరిగినా ఎండుమిర్చి ధరలు పతనమయ్యాయి. క్వింటా రూ.14,859 మాత్రమే పలికింది. గతేడాది ఇదే సమయానికి సుమారు రూ.25వేలు పలకడం విశేషం. ఇక వేరుశనగ కాయలు గరిష్ఠంగా రూ.6,850తో విక్రయాలు సాగుతున్నాయి.
News November 30, 2024
KNL: 153 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు నోటీసులు
హౌసింగ్కు సంబంధించి పురోగతి చూపని 153 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నోటీసులు పొందిన వారి వివరణల్లో సరైన కారణం లేకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లతో పీడీ హౌసింగ్, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు సమావేశం ఏర్పాటు చేసుకొని ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేయాలన్నారు.