News February 24, 2025
ఇస్రో నుంచి యువికా 2025 కు దరఖాస్తు చేసుకోండి

పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం పేరుతో యువిక -2025 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. సోమవారం నుంచి మార్చి 23 దాకా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు. 8వ తరగతి ఉత్తీర్ణులై 9వ తరగతి చదువుతున్న వారు అర్హులు. https//jigyasa.iirs.gov.in/yuvika అనే సైట్ లో అర్హత కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో కోరింది.
Similar News
News February 25, 2025
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీలపై కేసులు: విశాఖ జేసీ

గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్లు MRP కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం గ్యాస్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తామని విశాఖ జేసీ మయూర్ అశోక్ హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లతో సోమవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. దీపం-2 పథకం కింద సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీ జమ కావాలన్నారు. కాని పక్షంలో డీలర్లను సంప్రదించారని లబ్ధిదారులను కోరారు.
News February 25, 2025
అది ఇండియాకు అడ్వాంటేజ్: కమిన్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ దుబాయ్లోని ఒకే స్టేడియంలో అన్నిమ్యాచ్లు ఆడుతుండటం జట్టుకు అడ్వాంటేజ్ అని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కమిన్స్ అన్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా బలంగా ఉందని, ఈ అంశం వారికి మరింత కలిసి వస్తోందని కమిన్స్ తెలిపారు. కాగా గాయం కారణంగా కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.
News February 25, 2025
నాగర్ కర్నూల్ చెరువులో మహిళ మృతదేహం

నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. చెరువులోని బతుకమ్మ ఘాట్ దగ్గర గుర్తుతెలియని మహిళా మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. చెరువులోని మహిళా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.