News April 9, 2025
ఇస్రో యువిక -2025కు జగిత్యాల విద్యార్థిని

ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాల్లో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం. దీంతో అశ్వినికి టీచర్లు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
Similar News
News November 25, 2025
జనగామ: ముక్కిపోతున్న దొడ్డు బియ్యం!

జిల్లాలోని ఆయా రేషన్ డీలర్ల షాపులలో పాత స్టాక్ (దొడ్డు బియ్యం) ముక్కిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో మిగిలిపోయిన పాత స్టాక్ మొత్తం పురుగులు పట్టి పాడవుతున్నాయని, ఇప్పటికే 70% మేర బియ్యం పాడైపోయాయని ఆయా షాపుల రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోని బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
News November 25, 2025
కోటంరెడ్డి సోదరుడి కుమార్తె సంగీత్‌లో భారత క్రికెటర్

టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డికి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకకు రాహుల్ సిప్లిగంజ్ టీం ఇండియా స్పిన్నర్ చాహల్‌ను ఆహ్వానించారు. దీంతో ‘‘నేను చాహల్‌కి వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ హరిణ్య పోస్టు చేశారు.
News November 25, 2025
సికింద్రాబాద్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లాలంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలే శరణ్యం. ఇటీవల కాలంలో రైలులో కోచ్‌ల సంఖ్య సరిపోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వీటి సంఖ్యను పెంచాలని అధికారులకు వినతిపత్రాలిచ్చారు. ఈ నేపథ్యంలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 ఉన్న ఏసీ చైర్ కార్ కోచ్‌ల సంఖ్యను 16కు పెంచనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.


