News January 25, 2025
ఇస్రో శత ప్రయోగ వీక్షణకు రిజిస్టర్ చేసుకోండి

శ్రీహరికోట నుంచి ఈనెల 29న ఉదయం 6:23 నిమిషములకు ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ ఫ్ -15 రాకెట్ ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించడానికి పేర్లను రిజిస్టర్ చేసుకోవడానికి ఇస్రో సందర్శకులకు అవకాశం కల్పిస్తుంది. ఆన్లైన్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవడానికి క్రింద లింకును క్లిక్ చేసి మీ పేర్లను నమోదు చేసుకొని అనుమతి పొందవచ్చు. https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp
Similar News
News November 28, 2025
RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.
News November 28, 2025
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో 140 బస్తాల పసుపు విక్రయాలు జరిగాయి. ఈ వేలంలో క్వింటాల్ పసుపు ధర రూ.12,900 పలికింది. కొమ్ముల రకం పసుపు కనిష్ఠ, గరిష్ఠ, మోడల్ ధరలు రూ.12,900గా ఒకే ధర పలకగా, కాయ రకం పసుపు కూడా అదే ధర పలికినట్లు యార్డు అధికారులు తెలిపారు.
News November 28, 2025
జగిత్యాల: ‘రూ.50వేల లోపు నగదుకే అనుమతి’

ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాల రవాణాను అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 3 ఎస్ఎస్టీ, 20 ఎఫ్ఎస్టీ టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నియమాల ప్రకారం 50 వేల రూపాయలలోపు నగదు మాత్రమే అనుమతించబడుతుందని, అంతకంటే ఎక్కువైతే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.


