News February 6, 2025
‘ఈగల్’ వింగ్ విశాఖ సీఐగా ఎస్.రమేశ్

విశాఖపట్నం జిల్లా జోనల్ “ఈగల్” వింగ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా ఎస్.రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1972కి డయల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈయన విశాఖ జిల్లాలో 2010 నుంచి 2022 వరకు పలు విభాగలలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు.
Similar News
News November 4, 2025
ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.
News November 4, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 65 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం 65 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News November 4, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు సోమవారం పరిహారం అందజేసారు. హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన అనకాపల్లికి చెందిన రాపేటి కొండ లక్ష్మి కుటుంబం సభ్యులకు 2లక్షలు, హిట్& రన్ కేసుల్లో గాయపడిన సీతంపేటకు చెందిన చిలకలపూడి సురేష్, గాజువాకకు చెందిన ఇమంది లక్ష్మణరావుకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేసారు. ఇప్పటివరకు 88 మందికి రూ.71 లక్షల పరిహారం అందించారు.


